• తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానన్న దిల్ రాజు
  • త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న రొమాంటిక్ థ్రిల్లర్

“కమిటీ కుర్రోళ్లు” ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” ఫేమ్ తన్వీ నేగి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ “అదే నీవు అదే నేను” చిత్రం టీజర్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. శ్రీ లక్ష్మీ వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తుండగా, యువ దర్శకుడు కొండల్ దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలైన టీజర్ ఆసక్తికరమైన థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు కొండల్ మాట్లాడుతూ, ఈ సినిమా గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్ అని తెలిపారు. ఒక చిన్న తప్పటడుగు, ఆవేశంలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందనే అంశాన్ని ఉత్కంఠభరితంగా ఆవిష్కరించామని చెప్పారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని, థియేటర్‌లో ప్రతి సన్నివేశం ఉత్కంఠను పెంచుతుందని అన్నారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా సినిమా ఆకట్టుకుంటుందన్నారు.

డీవోపీ నిమ్మల జయపాల్ రెడ్డి అందించిన విజువల్స్, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, కనిష్క సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయని దర్శకుడు పేర్కొన్నారు. గోవాలో అందమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించామని, సినిమా మేకింగ్ విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదని తెలిపారు. కథకు అవసరమైన భారీ గేటెడ్ కమ్యూనిటీ సెట్‌ను ప్రత్యేకంగా నిర్మించారని చెప్పారు.

టీజర్ చూసిన అనంతరం దిల్ రాజు స్పందిస్తూ, ఈ టైటిల్ తన బ్యానర్‌లో రూపొందుతున్న ఓ చిత్రానికి పెట్టాలని అనుకున్నానని చెప్పడం చిత్ర బృందానికి ఆనందాన్ని కలిగించిందని దర్శకుడు వెల్లడించారు.

నిర్మాత గోవిందు కాండ్రేగుల మాట్లాడుతూ, సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించామని తెలిపారు. కథకు అవసరమైన భారీ గేటెడ్ కమ్యూనిటీ సెట్‌ను సహజత్వంతో నిర్మించామని, పలువురు ప్రముఖ ప్యాడింగ్ ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించారని చెప్పారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. టీజర్‌ను విడుదల చేసి అభినందించిన దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

నటీనటులు: త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్, సహర్ కృష్ణన్ తదితరులు.

సాంకేతిక బృందం:
నిర్మాత – కాండ్రేగుల గోవిందు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం – కొండల్
సంగీతం – కనిష్క
ఛాయాగ్రహణం – నిమ్మల జయపాల్ రెడ్డి
ఎడిటింగ్ – ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్ – నార్ని శ్రీనివాస్
డైలాగ్స్ – వై. అమ్మిరాజు
పాటలు – పూర్ణాచారి.