ఉమ్మడి తూ. గోదావరి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
NEWS Aug 28,2024 02:52 am
ఉమ్మడి తూ.గో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ బాలబాలికల సబ్ జూనియర్స్ జట్ల ఎంపిక సెప్టెంబరు 1న అన్నవరం సత్యదేవ జూనియర్ కళాశాలలో జరుగుతాయని జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఛైర్మన్ ముప్పన వీర్రాజు తెలిపారు. శంఖవరం మండలం అన్నవరంలో ఈ జట్ల ఎంపిక జరుగుతుందన్నారు. 2009 జనవరి 2వ తేదీ తర్వాత జన్మించిన ఆసక్తిగల క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొనవచ్చని వివరించారు.