www.breakingnow.app | Sat, 28 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Tirupati

వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల తేదీలు

Share:
128 Views
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల తేదీలు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను ప్రకటించింది. నవంబర్ 28న ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది. నవంబర్ 30న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం ఆన్‌లైన్‌లో ఈ-డిప్ నమోదు చేసుకునే అవకాశం కల్పించనుంది. భక్తులు విడుదల తేదీలు, సమయాలను గమనించి ముందుగానే దర్శన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.