www.breakingnow.app | Sat, 28 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Amaravati

అమరావతి నిర్మాణంపై లోకేశ్ వీడియో

Share:
128 Views

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ X వేదికగా అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. రాజధాని నిర్మాణానికి ముందు, ప్రస్తుతం జరుగుతున్న పనులను పోలుస్తూ రూపొందించిన ఈ వీడియో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజధానిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం వంటి కీలక భవనాల నిర్మాణానికి సంబంధించి తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్మాణాల కోసం గతంలో కేటాయించిన రూ.4,688 కోట్లను రూ.6,641 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపారు. అలాగే రాజధానిలో వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.