www.breakingnow.app | Thu, 26 Nov 2026
LATEST NEWS Telangana, Nizamabad

ఉప్లూర్‌ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం

Share:
128 Views

కమ్మర్‌పల్లి: ఉప్లూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు భారత రాజ్యాంగ విశిష్టత, గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. వేడుకల్లో భాగంగా పోస్టర్‌ డ్రాయింగ్‌, రాజ్యాంగ అంశాలపై క్విజ్‌, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. హక్కుల గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఉపాధ్యాయులు సూచించారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.