www.breakingnow.app | Fri, 27 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

రోప్ స్కిప్పింగ్‌లో నీలేష్‌కు స్వర్ణ పతకం

Share:
128 Views
రోప్ స్కిప్పింగ్‌లో నీలేష్‌కు స్వర్ణ పతకం

కరీంనగర్: ఈ నెల 25న కొత్తపల్లిలోని విద్యాపీఠ్ హైస్కూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో వాగ్దేవి అరపేట (మెట్‌పల్లి) విద్యార్థి మాడవేణి నీలేష్ ప్రతిభ చాటాడు. స్పీడ్ హోప్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే పాఠశాలకు చెందిన మరో 10 మంది విద్యార్థులు ఈ నెల 29న హైదరాబాద్‌లోని పటాన్‌చెరు మైత్రి గ్రౌండ్స్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని పాఠశాల కరస్పాండెంట్ పుప్పాల నవీన్ కుమార్, డైరెక్టర్లు నల్ల గోపిరెడ్డి, ముక్క నరేష్ కుమార్ వెల్లడించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.