రాయికల్: మండలంలోని మైతాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి పాశ్వాన్ కృపాకర్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. భారత రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పోషించిన కీలక పాత్రను వివరించాడు. పౌరుల ప్రాథమిక హక్కులు, విధులు, సమానత్వం, స్వేచ్ఛ వంటి రాజ్యాంగ విలువలపై చక్కగా ప్రసంగించాడు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపునిచ్చాడు. విద్యార్థి ప్రసంగంపై ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.
LATEST NEWS
Telangana, Jagtial
ఆకట్టుకున్న రాజ్యాంగంపై విద్యార్థి ప్రసంగం
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
తిరుమలలో ప్రత్యేక తనిఖీలు
Nov 26,2026 07:56 pm
శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు
Nov 26,2026 07:55 pm
బీమా పథకం నమోదు శిబిరాల తనిఖీ
Nov 26,2026 07:54 pm
ఉప్లూర్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం
Nov 26,2026 07:53 pm