www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు

Share:
128 Views
ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు

2003-04 విద్యా సంవత్సరంలో మోహన్ రావుపేట్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వెంకటాపూర్ గుట్ట ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాల రోజుల్లోని అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆటపాటలు, సరదా సంభాషణలతో ఆనందంగా గడిపారు. ఏళ్లు గడిచినా చెదరని స్నేహబంధానికి ఈ ఆత్మీయ సమ్మేళనం వేదికగా నిలిచింది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.