NRIలకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయం ‘దేవి’ అనే AI ఆధారిత అవతార్‌ను పరిచయం చేసింది. పాస్‌పోర్టులు, వీసాలు, OCI సేవలు, జననాల నమోదు తదితర కాన్సులర్ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఇది అందిస్తుంది. నవరాత్రి, దుర్గాపూజ శుభ సందర్భంగా భారత రాయబారి సందీప్ చక్రవర్తి ఈ AI అవతార్‌ను ప్రారంభించారు. సాంకేతికత ఆధారిత పాలనకు ప్రాధాన్యమిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న NRIలకు మెరుగైన సేవలు అందించడంలో ఈ ప్రయత్నం కీలకం.