www.breakingnow.app | Sun, 29 Nov 2026
BIG NEWS Telangana, Hyderabad

3 రోజులు తిరుపతిలో మోదీ

Share:
128 Views
3 రోజులు తిరుపతిలో మోదీ

ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. డిసెంబర్‌ 4 నుంచి 6 వరకు ఏర్పేడులోని ఐసర్‌లో జరిగే 61వ అఖిల భారత పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. డిసెంబర్‌ 4న రాత్రి తిరుపతికి చేరుకుని ఐసర్‌లో బస చేస్తారు. 5, 6 తేదీల్లో సదస్సు కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిసెంబర్‌ 6న సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌తో పాటు సుమారు 200 మంది ఐపీఎస్‌ అధికారులు హాజరుకానున్నారు. అంతర్గత భద్రత, సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌, ఏఐ వినియోగంపై చర్చించనున్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.