రాజమౌళి - మహేశ్బాబు కాంబో మూవీ ‘వారణాసి’ విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్ ఐమాక్స్ యూట్యూబ్ ఛానల్లో 1.10 కోట్లకు పైగా వ్యూస్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. డాల్బీ అధికారిక ఛానల్లోనూ 73 లక్షలకు పైగా వ్యూస్తో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే గ్లోబల్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది.