దేవి శరన్నవరాత్రులు ప్రారంభం
NEWS Oct 11,2026 06:09 pm
నేటి నుండి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో నిర్మల్ జిల్లా దేవి ఆలయాలు భక్తులకు కిటకిటలాడుతున్నాయి. దుర్గామాత ఆలయంలో సుమారు 9,000 మంది భక్తులు భవాని మాల ధారణ చేశారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో 9 రోజుల పాటు భక్తులకు అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది.