www.breakingnow.app | Wed, 25 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Tirupati

ఈనెల 26న‌ తిరుమలకు చంద్రబాబు

Share:
128 Views
ఈనెల 26న‌ తిరుమలకు చంద్రబాబు

ఈ నెల 26న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన జరగనున్న ప్రాంతాల్లో జిల్లా ఎస్పీతో కలిసి జిల్లా కలెక్టర్ అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్ఎల్) తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఉదయం 10.45 గంటలకు తిరుమలలోని గాయత్రి అతిథి గృహానికి చేరుకుంటారని, 11.10 గంటలకు శ్రీవారి దర్శనానికి వెళ్తారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారని వెల్లడించారు. పర్యటన సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.