www.breakingnow.app | Wed, 25 Nov 2026
LIFE STYLE Telangana, Hyderabad

గోదావరి పుష్కరాల లోగో రూపకల్పనకు పోటీ

Share:
128 Views
గోదావరి పుష్కరాల లోగో రూపకల్పనకు పోటీ

HYD: గోదావరి పుష్కరాల సందర్భంగా ఆకట్టుకునే లోగో, ట్యాగ్‌లైన్ రూపొందించే వారికి తెలంగాణ దేవాదాయ శాఖ నగదు బహుమతులు ప్రకటించింది. వ్యక్తిగతంగా లేదా ముగ్గురు సభ్యులతో కూడిన బృందంగా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తొలి బహుమతిగా రూ.లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు అందజేయనున్నారు. అలాగే ఎంపిక చేసిన టాప్ 100 ఎంట్రీలకు ప్రశంసాపత్రాలు అందించనున్నారు. ఆసక్తి ఉన్నవారు తమ లోగో, ట్యాగ్‌లైన్ డిజైన్లను నవంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు godavaripushkaralutg@gmail.com ఈ-మెయిల్‌కు పంపించాలని దేవాదాయ శాఖ సూచించింది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.