www.breakingnow.app | Wed, 25 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Tirupati

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత

Share:
128 Views
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్‌ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్‌ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా పోలీస్‌ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించనున్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.