ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
NEWS Oct 05,2026 05:03 pm
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను సంయుక్తంగా వరించింది. లిస్టులో కార్ల్ డైసర్‌రోత్, పీటర్ హెగెమాన్, జార్జ్ నాజెల్ ఉన్నారు. light-gated ion channels, optogenetics రంగంలో వారు చేసిన అపూర్వమైన, ఆవిష్కరణలకు గాను ఆ ముగ్గురికి వైద్య నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నట్లుగా నోబెల్ కమిటీ తెలిపింది. 6 రంగాలకు సంబంధించిన నోబెల్ అవార్డుల ప్రకటనలు అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 12 వరకు వరుసగా కొనసాగనున్నాయి.