www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

Share:
128 Views
నూతన పాక్స్ చైర్మన్లకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

జగిత్యాల: జగిత్యాల పాక్స్ చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, అల్లిపూర్ పాక్స్ చైర్మన్‌గా తంగెళ్ల రమేష్, ఇటిక్యాల పాక్స్ చైర్మన్‌గా మర్రిపెల్లి శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపి, రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.