పెట్రోల్ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
NEWS Oct 04,2026 01:45 pm
విజయవాడలో జరిగిన పాన్ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్ బైక్‌ను రూ.40 వేలతో 4 గంటల్లో ఈవీగా మార్చే సాంకేతికతను పరిశీలించారు. కర్నూలులో డ్రోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామని ఆక్సి ఏరోస్పేస్ ప్రతినిధులు తెలిపారు. రక్షణ డ్రోన్‌ల తయారీకి ఫాల్కన్ స్కై వర్క్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఏఐ ఫేస్ స్కాన్‌తో 30 సెకన్లలో ఆరోగ్య నివేదిక అందించే యాప్‌ను సీఎం పరీక్షించారు. విద్యార్థుల ప్రజంటేషన్‌ను అభినందించారు. పెట్టుబడులకు ఏపీ అనుకూలమన్నారు.