కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
NEWS Oct 03,2026 08:03 pm
కథలాపూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వేముల కృష్ణ, ప్రధాన కార్యదర్శులుగా ఎండీ రెహన్, సత్యనారాయణ గౌడ్, గడ్డం చిన్నారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీహరి, పబ్బ శ్రీనివాస్, కార్యదర్శులుగా కృష్ణచారి, మధు, రాజేశం, రమేష్ యాదవ్ నియమితులయ్యారు.