అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు
NEWS Sep 28,2026 11:41 pm
అక్టోబర్ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందాలంటే ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి సమానమైన డిపాజిట్లపై వడ్డీ రేట్లలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జనన, మరణాల నమోదులో ఆలస్యానికి నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఏడాది దాటిన తర్వాత నమోదుకు సంబంధిత అధికారుల అనుమతి అవసరం కాగా, రెండేళ్లకు మించి ఆలస్యమైతే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్ ఆదేశాలు అవసరం కానున్నాయి. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే మార్పులపై ముందుగానే సంబంధిత శాఖల నుంచి వివరాలు తెలుసుకోవడం మంచిది.