రావికమతం ప్రధాన కేంద్రంలో సోమవారం ఉదయం నుంచి ఎండ తీవ్రంగా కాసింది. మధ్యాహ్నం వరకు ఎండ ప్రభావం కొనసాగింది. సాయంత్రం 4:30 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని చల్లబడింది. అనంతరం వర్షం కురవడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. వర్షంతో ప్రధాన కేంద్రంలోని వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.