26 రకాల వంటకాలతో భారీ అన్నసమారాధన
NEWS Sep 27,2026 11:18 am
అనకాపల్లి జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా 26 రకాల వంటకాలు, ఒక కూల్‌డ్రింక్‌తో భారీ అన్నసమారాధన నిర్వహించారు. బుచ్చయ్యపేట మండలం పొట్టిదోరపాలెంలో గుడ్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ సిద్ధి వినాయక నిమజ్జనం సందర్భంగా సాయంత్రం కోలాటం, డీజే, భారీ మందుగుండు ప్రదర్శన నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.