ఘనంగా బాలసాహిత్య గ్రంథాలయం ప్రారంభం
NEWS Sep 27,2026 10:46 am
ఇబ్రహీంపట్నం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలసాహిత్యానికి అనుగుణంగా నూతనంగా తీర్చిదిద్దిన గ్రంథాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలుగు ఉపాధ్యాయురాలు కటుకం కవిత ఆధ్వర్యంలో 100 మంది తెలంగాణ ప్రముఖ కవుల చిత్రపటాలు, వారి జీవిత విశేషాలు, తెలుగు వ్యాకరణ సూత్రాలు, 100 నీతి పద్యాలు, 100 నీతి కథల బొమ్మల కార్డులు, 1000 పదాలు–అర్థాలు, రామాయణ, మహాభారత కథలను చిత్రాలతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఉపసర్పంచ్ నాంపల్లి రమేష్ రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.