చాకలి ఐలమ్మకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
NEWS Sep 26,2026 10:38 pm
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి సమాజానికి ఆదర్శమని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్బంగా జగిత్యాలలోని చింతకుంట చెరువు వద్ద పట్టణ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో పుర ఛైర్ పర్సన్ వాణీ, DCC.అధ్యక్షుడు నందయ్య, కమిషనర్ సత్య ప్రణవ్, AMC.చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.