తెలంగాణలో 6 నెలలు ఎన్నికల సందడి
NEWS Sep 26,2026 11:51 am
తెలంగాణలో వచ్చే 6 నెలలపాటు వరుస ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోపు ఎన్నికలు జరగనున్నాయి. GHMC తోపాటు మల్కాజిగిరి, సైబరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు, పలు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. 31 జిల్లా పరిషత్తులు, 565 మండల పరిషత్తులకు పరిషత్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్గం సుగమం కానుంది.