ఈనెల 27న ఉచిత మెగా వైద్య శిబిరం
NEWS Sep 26,2026 11:53 am
ఏటూరు నాగారం: చిన్న బోయినపల్లి గ్రామంలో గల గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల 27న మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎంపీడీవో శ్రీనివాస ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని బీబీనగర్ ఎయిమ్స్, ప్రతిమ మెడికల్ కళాశాల నుంచి వైద్య నిపుణులు హాజరవుతారని చెప్పారు. ఇందులో క్షయ, అల్ట్రాసౌండ్, మెమోగ్రాఫ్ ఇలా పలు రకాల పరీక్షలన్నీ ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.