పాతికేళ్లుగా నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ సేవలు
NEWS Sep 25,2026 10:30 pm
రాయికల్: మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన అనుపురం నాగేశ్వర్ గౌడ్ ఎల్ఐసీ ఏజెంట్‌గా 25 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నారు. పావు శతాబ్దంగా ప్రజలకు జీవిత బీమా ప్రాధాన్యతను వివరిస్తూ, కుటుంబాల భవిష్యత్ భద్రత కోసం బీమా సేవలు అందిస్తున్నారు. ఖాతాదారుల విశ్వాసాన్ని పొందుతూ 25 ఏళ్లుగా సేవలందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఖాతాదారులు, శ్రేయోభిలాషులు నాగేశ్వర్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు.