వడ్డాదిలో అంగన్వాడి ఉత్సవాలు ప్రారంభం
NEWS Sep 25,2026 06:54 pm
బుచ్చయ్యపేట మండలం వడ్డాది అంగన్వాడి కేంద్రం–1లో అంగన్వాడి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గర్భిణీలు, బాలింతలు, ప్రీస్కూల్ పిల్లల తల్లులు, కిషోర బాలికలు పాల్గొన్నారు. ఎన్జీవో కేఎంఎం అసోసియేషన్ డైరెక్టర్ ఎలిసెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఉత్సవాల ఉద్దేశమన్నారు. ఆశా కార్యకర్త వరలక్ష్మి, అంగన్వాడి కార్యకర్త అమ్మాజీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.