మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం
NEWS Sep 25,2026 03:00 pm
గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న వడ్డాది కో-ఆపరేటివ్ సొసైటీ భవనంలో ఉదయం 10 గంటలకు మెగా దివ్యాంగుల బస్ పాస్ శిబిరం నిర్వహించనున్నారు. సామాజిక కార్యకర్త ఆకుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ శిబిరంలో ఉచితంగా సేవలు అందించనున్నారు. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ దివ్యాంగత్వం ఉన్న వారు SADAREM ధ్రువపత్రం, ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 83318 04441 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.