రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీస్
NEWS Apr 05,2025 06:11 pm
రామానాయుడు స్టూడియోకు కోలుకోలేని షాక్ తగిలింది. స్టూడియో నిర్మాణం కోసం గతంలో విశాఖపట్నంలో భూములు కేటాయించారు. సురేష్ ప్రొడక్షన్స్ కేటాయించిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు గుర్తించారు. దీంతో సర్కార్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. సదరు సంస్థ ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి వివరణ కోరుతామన్నారు జిల్లా కలెక్టర్.