మున్సిపల్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి
NEWS Apr 05,2025 01:22 pm
మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు, బలహీన వర్గాల నేత జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో మేనేజర్ వెంకటలక్ష్మి, డిఈ నాగేశ్వరరావు, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, విజయ్, శ్రీకాంత్, రచన తదితరులున్నారు.