కస్టడీలో ఉన్న విద్యార్థులను రిలీజ్ చేయాలి
NEWS Apr 05,2025 08:45 am
కస్టడీలో ఉన్న విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. నార్త్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఈస్ట్ క్యాంపస్ వరకు ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థులను బేషరతుగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీ భూ వివాదంలో స్టూడెంట్స్ మీద, మద్దతు తెలిపిన సివిల్ సొసైటీ గ్రూప్ ల మీద పెట్టిన ఎఫ్ ఐ ఆర్ లను కొట్టి వేయాలన్నారు.