సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
NEWS Jan 25,2025 10:26 am
డిచ్ పల్లి మండలంలోని ఘన్‌పూర్ గ్రామానికి చెందిన పలువురు బాధితులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాల మేరకు చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని పార్టీ మండల సీనియర్ నాయకుడు షాదుల్లా అన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ సతీశ్‌రెడ్డి, నాయకులు రామకృష్ణ, డాక్టర్ లింబాద్రి, హరీశ్, గంగి భూపతి, శంకర్‌గౌడ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.