సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ జెడ్పీహెచ్‌ఎస్‌కు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్‌ఈ విద్యాసాగర్ 25 జతల క్రీడా దుస్తులను వితరణ చేశారు. దాత తరఫున మాజీ సర్పంచ్ గంగాదాసు హెచ్‌ఎంకు దస్తులను అందజేశారు. గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. క్రీడాకారులు అభివృద్ధికి తమ వంతు సహాయ, సహకారం అందిస్తామని తెలిపారు.