తెలంగాణ యూనివర్సిటీలో 2014 వివాదాస్పద నియామక అభ్యర్థులకు పదోన్నతులు కల్పించడానికి రిజిస్ట్రార్ ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వ విద్యాలయంలో సమస్యలను పట్టించుకోని ఆయన పూర్తి స్థాయి పాలకమండలి లేకుండానే పదోన్నతులు కల్పించడానికి పావులు కదుపుతున్నారు. అధికా రులను తప్పుదోవ పట్టించి తన సొంత ఎజెండా అమలుకు యత్ని స్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత పాలకమండలి తిరస్కరించిన 2014 వివాదాస్పద నియామకాల పదోన్నతులు కల్పించే ఫైల్‌ను ముందుకు కదుపుతూ వచ్చారు.