సింగపూర్ తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
NEWS Jan 17,2025 12:27 pm
సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యూనివర్శిటీల పనితీరును పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజ్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీలో భాగం కానున్నట్లు తెలిపింది.