గొడవల గురించి మాట్లాడలేదు
NEWS Jan 17,2025 06:19 am
నటుడు మంచు మనోజ్ తమ ఇంటి గొడవలకు సంబంధించి స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ను కలిసిన మాట వాస్తవమేనని అన్నారు. కేవలం మర్యాద పూర్వకంగా కలిశానని, శివుడి మీద ఒట్టేసి చెబుతున్నానని మా ఇంటి తగాదాలు, గొడవల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నాడు.