ఓయూలో విద్యార్థుల సమక్షంలో సాళ్వె జయంతి వేడుకలు

హైదరాబాద్: 19వ శతాబ్దపు తొలి దళిత మహిళా రచయిత్రి, సామాజిక సంస్కర్త 185వ జయంతి వేడుకలను ‘విద్యార్థి దినోత్సవం’ పేరిట లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాయక్వాడ్ తులసిదాస్ మాంగ్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓయూ ఆచార్యులు డా. నమ్రత బాగ్డే (మరాఠీ విభాగం అధిపతి) మాట్లాడుతూ, “విద్యా జ్ఞానమే దివ్య ఔషధం” అని పేర్కొన్నారు. మహిళలకు గొంతుకగా నిలిచి, విద్య ద్వారా సామాజిక మార్పుకు బాటలు వేసిన ముక్తా సాళ్వె జయంతిని ‘విద్యార్థి దినోత్సవం’గా అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.అలాగే ప్రొఫెసర్ వాగ్మారే మాయాదేవి (హిందీ విభాగం అధిపతి) మాట్లాడుతూ, ముక్తా సాళ్వె జీవితం, రచనలు పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఓయూ ఆచార్యులు ప్రొ. కె. సంగీత, డా. అజయ్ కుమార్, మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంబ్లే శంకర్ మాంగ్, హైదరాబాద్ కమిటీ ఉపాధ్యక్షులు నామ్‌వాడ్ రమాకాంత్ మాంగ్‌తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ముక్తా సాళ్వె 14 ఏళ్ల వయసులోనే అంటరానితనాన్ని ప్రశ్నిస్తూ విప్లవాత్మక వ్యాసం రాసి చరిత్రలో నిలిచిన తొలి దళిత మహిళా రచయిత్రిగా గుర్తింపు పొందారు.