• M. Narasimha Swamy

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న దాదాపు 96 లక్షల మంది భారతీయుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అత్యవసర సహాయ నంబర్లను ప్రకటించింది. యుద్ధం లేదా ఇతర సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న భారతీయులు వైద్య సహాయం, భద్రతా పరిరక్షణ లేదా స్వదేశానికి తరలింపు కోసం సంబంధిత దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించవచ్చు.

పాలస్తీనా
పాలస్తీనాలోని రామల్లాలో ఉన్న భారతీయులు +970592916418 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. అలాగే repoffice@mea.gov.in
, cons.ramallah@mea.gov.in
ఈ-మెయిల్ చిరునామాల ద్వారా సహాయం పొందవచ్చు.

ఖతార్
దోహాలో నివసిస్తున్న వారు 00974-55647502 నంబర్‌కు కాల్ చేయవచ్చు. cons.doha@mea.gov.in
కు ఈ-మెయిల్ పంపి వివరాలు తెలియజేయవచ్చు.

సౌదీ అరేబియా
రియాద్ మిషన్‌ను 00-966-11-4884697 నంబర్‌లో సంప్రదించవచ్చు. వాట్సాప్ సహాయ నంబర్ 00-966-542126748, టోల్-ఫ్రీ నంబర్ 800 247 1234 కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇజ్రాయెల్

టెల్ అవీవ్ మిషన్ సహాయం కోసం +972-54-7520711, +972-54-2428378 నంబర్లకు కాల్ చేయవచ్చు. cons1.telaviv@mea.gov.in
ద్వారా కూడా సంప్రదించవచ్చు.

ఇరాన్
టెహ్రాన్‌లో ఉన్న భారతీయులు +989128109115, +989128109109, +989128109102, +989932179359 నంబర్లను సంప్రదించవచ్చు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయ్)
అబుదాబి మిషన్ భారతీయుల కోసం pbsk.dubai@mea.gov.in
, ca.abudhabi@mea.gov.in
ఈ-మెయిల్ చిరునామాలు జారీ చేసింది. టోల్-ఫ్రీ నంబర్ 800-46342, వాట్సాప్ నంబర్ +971543090571 అందుబాటులో ఉన్నాయి.

కువైట్
+9665501946 నంబర్‌కు కాల్ చేయవచ్చు. community.kuwait@mea.gov.in
కు ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

బహ్రెయిన్
హెల్ప్‌లైన్ నంబర్ 00973-39418071 ద్వారా సహాయం పొందవచ్చు.

ఒమన్
cw.muscat@mea.gov.in
, cons.muscat@mea.gov.in
ఈ-మెయిల్ చిరునామాలతో పాటు 80071234 టోల్-ఫ్రీ నంబర్, +96898282270 వాట్సాప్ నంబర్ అందుబాటులో ఉన్నాయి.

జోర్డాన్
00962-770 422 276 నంబర్‌కు కాల్ చేయవచ్చు.

ఇరాక్
బాగ్దాద్ మిషన్‌ను +964 771 651 1185, +964 770444 4899 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. అలాగే cons.baghdad@mea.gov.in
, cons1.baghdad@mea.gov.in
, pol.baghdad@mea.gov.in
ఈ-మెయిల్ ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చు. మరిన్ని వివరాలు బాగ్దాద్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సహాయ నంబర్లు జారీ అయ్యాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే సంబంధిత నంబర్లకు కాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అధికారిక సమాచారం కోసం ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల వెబ్‌సైట్లను మాత్రమే పరిశీలించాలని సూచించింది.