▪️బిఎన్ఐ హైటెక్ చాప్టర్ సమావేశంలో ముఖ్య అతిథిగా రిట్జీ గ్రూప్ గ్లోబల్ సీఈఓ ఎం.ఎన్.ఆర్. గుప్తా
హైదరాబాద్:
ప్రముఖ బిజినెస్ నెట్వర్క్ సంస్థ బీఎన్ఐ (బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్) హైటెక్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపార నెట్వర్కింగ్ సమావేశం ఘనంగా జరిగింది. రాడిసన్ బ్లూ హోటల్ జరిగిన ఈ కార్యక్రమానికి రిట్జీ గ్రూప్ గ్లోబల్ సీఈఓ, ప్రముఖ ఎంట్రప్రెన్యూర్, ఇన్వెస్టర్, మోటివేషనల్ స్పీకర్ ఎం.ఎన్.ఆర్. గుప్తా ముఖ్య అతిథిగా హాజరై వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చారు.
సమావేశంలో భాగంగా బిఎన్ఐకి చెందిన ‘ది వాల్ట్ పవర్ టీమ్’ తమ సేవలు, నైపుణ్యాలను సభ్యులకు పరిచయం చేసింది. ఒక సంస్థను ప్రారంభ దశ నుంచి ఐపీఓ స్థాయికి తీసుకెళ్లే ప్రక్రియలో అవసరమైన చట్టపరమైన అనుసరణలు, లీగల్ అడ్వైజరీ, టాక్స్ ఆడిట్లు, అసెట్ ప్రొటెక్షన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పెట్టుబడుల సమీకరణ (రైజింగ్ క్యాపిటల్) వంటి కీలక అంశాలపై పవర్ టీమ్ ప్రతినిధులు సమగ్రంగా వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎం.ఎన్.ఆర్. గుప్తా, వ్యాపార రంగంలో తన అనుభవాలను పంచుకుంటూ యువ పారిశ్రామికవేత్తలకు విలువైన సూచనలు చేశారు. ప్రపంచ వేదికపై భారతీయుల ప్రతిభ, సామర్థ్యాలను చాటిచెప్పాలనే లక్ష్యంతో తాను సాగించిన వ్యాపార ప్రయాణంలోని అనుభవాలను వివరించారు.
“ఫలితాల గురించి ఆలోచించే ముందు మీ లక్ష్యంపై పూర్తి దృష్టి కేంద్రీకరించండి. మీరు లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి చేస్తే విజయాలు వాటంతట అవే వస్తాయి” అని ఆయన పేర్కొన్నారు.
