హైదరాబాద్, ములుగు (మీడియాబాస్ నెట్‌వర్క్):
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సమర్థవంతంగా సన్నద్ధం చేయాలన్న లక్ష్యంతో దొడ్డ నర్సిరెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (DNR ట్రస్ట్) చేపట్టిన “విజయపథం” కార్యక్రమం విద్యా రంగంలో విశేష స్పందన పొందుతోంది. ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సపోర్టివ్ స్టడీ మెటీరియల్ ఈ కార్యక్రమానికి ప్రధాన బలం.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం వంటి అన్ని ప్రధాన విషయాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిపుణులు, రిసోర్స్ పర్సన్లు తమ మేధస్సును అంకితం చేసి ఈ స్టడీ మెటీరియల్‌ను రూపొందించారు. విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించిన ఈ రచయితలకు DNR ట్రస్ట్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

మారుమూల వెనుక మండల ప్రాంతమైన ములుగు జిల్లాలో గుణాత్మక విద్యలో సాధన భాగంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు 100% ఉత్తీర్ణతకు ఉపయుక్తమైన డీఎన్ఆర్ విజయపథం ఎస్సెస్సీ స్టడీ మెటీరియల్”ను ములుగు జిల్లాలో ఉచితంగా పంపిణీ చేయుటకు అవకాశం కల్పించి డిఎన్ఆర్ ట్రస్టును ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ దివాకర్ గారికి, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ సిద్ధార్థ రెడ్డి గారికి, ములుగు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగ కార్యదర్శి సూర్యనారాయణ గారికి, సహాయ కార్యదర్శి వ్యాసం విక్రమ్ కుమార్ గారికి, అదనో పరీక్షలు నియంత్రణ అధికారి వినోద్ కుమార్ గారికి, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పనిచేయుచున్న సమగ్ర శిక్ష సమన్వయకులు అందరికీ డీఎన్ఆర్ అధినేత దొడ్డ ప్రతాప్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

స్టడీ మెటీరియల్ రూపకర్తల శ్రమ ఫలితం
డిఎన్ఆర్ ట్రస్ట్ రూపొందించిన విజయపథం 10వ తరగతి స్వీయ అభ్యసన స్టడీ మెటీరియల్ డాక్టర్ కందాలరామయ్య ఆధ్వర్యంలో రూపకల్పన జరిగింది. ఇందులో తెలుగు- చక్రవర్తుల శ్రీనివాస్,
హిందీ- ఎస్ కే గౌస్ పా షా, ఇంగ్లీష్- డాక్టర్ కోల రవి, టీవీ రావు; గణితం డాక్టర్ కందాలరామయ్య ఇమ్మడి రాము, కొమండూరి శ్రీధరాచార్యులు , సైకం శ్రీనివాస్ రెడ్డి, సూర దామోదర్, కాసం సంతోష్, భౌతిక శాస్త్రము- కాసం శశికళాధర్, పోతరాజు ఆనందం, జీవశాస్త్రం మారం పవిత్ర, సాంఘిక శాస్త్రం రతంగపాణి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి.. విజయపథం ఎస్ఎస్సి స్వీయ అభ్యసన స్టడీ మెటీరియల్ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. డిఎన్ఆర్ ట్రస్టుకు సమన్వయకర్తగా డాక్టర్ కందాల రామయ్య వ్యవహరించి చక్కని మార్గదర్శనం చేశారు.

స్టడీ మెటీరియల్‌ను పాఠశాల స్థాయిలో సమర్థంగా వినియోగిస్తూ, ప్రత్యేక పరీక్షా ప్రణాళికలతో విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమని DNR ట్రస్ట్ పేర్కొంది. క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు స్వచ్ఛందంగా అందించిన సేవలు విజయపథానికి వెన్నుదన్నుగా నిలిచాయి.
విజయపథం స్టడీ మెటీరియల్‌తో పాటు గతంలో DNR అందించిన ఏఐ ఫర్ యంగ్ మైండ్ పుస్తక ఎడిటర్, నిరంతర మీడియా సహకారం అందిస్తున్న మీడియా బాస్ అధినేత ముద్దం నరసింహ స్వామికి డీఎన్ఆర్ ట్రస్ట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అలాగే ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సేవలు ప్రశంసనీయం అని పేర్కొంది.
ములుగు జిల్లాతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మొత్తం 83 ప్రభుత్వ పాఠశాలలకు విజయపథం విస్తరించడమే ఈ కార్యక్రమ విజయానికి నిదర్శనం. “విద్యార్థులే దేశానికి తరగని నిధి” అనే ధృఢ సంకల్పంతో, విద్యాదానం మహాదానం అనే విలువను ముందుకు తీసుకెళ్తూ DNR ట్రస్ట్ చేస్తున్న ఈ విద్యా సేవలు భవిష్యత్తులో మరింత విస్తరించాలని విద్యాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

