హైదరాబాద్: 21వ శతాబ్దంలో విద్యార్థినీ విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో పోటీ పడగలిగేలా తీర్చిదిద్దడంలో ఆంగ్ల భాషా నైపుణ్యాలు అత్యంత కీలకమని రాష్ట్ర విద్యా మరియు పరిశోధన మండలి (SCERT) చీఫ్ ఫ్యాకల్టీ మంగారెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన అనంతరం, తెలంగాణ ఆంగ్ల భాష ఉపాధ్యాయుల సంఘం (ELTA – Telangana) ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాల అభివృద్ధి కోసం పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వకృత్వ పోటీలు, ఆంగ్ల నాటకాలు, ఆంగ్ల కథల పోటీలు, తెలంగాణ ఇంగ్లీష్ ఒలంపియాడ్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, భావవ్యక్తీకరణ సామర్థ్యాలను మరింతగా పెంపొందించాలనే లక్ష్యంతో, తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ TED-Ed లైసెన్స్ పొందిన అనంతరం TED-Ed Student Talks కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంగారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ELTA రాష్ట్ర అధ్యక్షులు టి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో చదువుతున్న 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు TED Talksతో పాటు తెలంగాణ ఇంగ్లీష్ ఒలంపియాడ్ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలోని 28 జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారని చెప్పారు.

గెలుపొందిన విద్యార్థులు
తెలంగాణ ఇంగ్లీష్ ఒలంపియాడ్
స్ట్రీమ్ – 1 (జూనియర్):
▪️ ఫస్ట్ ప్రైజ్ – చైత్ర
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నామాపూర్, జగిత్యాల జిల్లా
స్ట్రీమ్ – 2 (జూనియర్):
▪️ హర్షవర్ధన్ రావు
తెలంగాణ మోడల్ స్కూల్, మరిపెడ, మహబూబాబాద్ జిల్లా
స్ట్రీమ్ – 1 (సీనియర్స్):
▪️ చిట్యాల నవదీప్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బేతవోల్, సూర్యాపేట జిల్లా
స్ట్రీమ్ – 2 (సీనియర్స్):
▪️ ఎం. సంజన
తెలంగాణ మోడల్ స్కూల్, మంచిర్యాల్ జిల్లా
TED-Ed Student Talks – విజేతలు
సీనియర్ విభాగం
▪️ స్ట్రీమ్ – I: వి. వర్షిత
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (ZPHS – Girls), హుజూరాబాద్
▪️ స్ట్రీమ్ – II: జి. చైత్ర
తెలంగాణ మోడల్ స్కూల్, మగ్గిడి, జగిత్యాల జిల్లా
జూనియర్ విభాగం
▪️ స్ట్రీమ్ – I: ఎం.డి. తబస్సుమ్
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, టి.వి.ఎం. మధిర, ఖమ్మం జిల్లా
▪️ స్ట్రీమ్ – II: వి. శివ ప్రియ
తెలంగాణ మోడల్ స్కూల్, రామడుగు, కరీంనగర్ జిల్లా
మొత్తం రూ.1,20,000 విలువైన ప్రశంసా బహుమతులను ఎయిర్‌టెల్ భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాధవి శ్రీకాంత్ రెడ్డి, వెంకట్రావు, జుత్తి కిరణ్ ప్రసాద్ గార్లు విజేతలకు అందజేశారు.
రాష్ట్రస్థాయిలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి రూ.200 విలువైన గిఫ్ట్ హ్యాంపర్లు అందించగా, ఇందుకు మొత్తం రూ.30,000 ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనురాగ్ యూనివర్సిటీ డీన్ శ్రీనివాసరావు, ELTA వ్యవస్థాపక అధ్యక్షులు బత్తిని కొమరయ్య, ప్రధాన కార్యదర్శి వినదర్ రాజు, సంపత్ కుమార్, పూల శ్రీనివాస్, కోల రవికుమార్, వంగర లక్ష్మణ్, శ్రీనివాస్ రెడ్డి, DNR ట్రస్ట్ అధినేత దొడ్డ ప్రతాప్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వంశీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
