www.breakingnow.app | Fri, 27 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

దాబాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Share:
128 Views
దాబాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

కోరుట్ల: పట్టణ పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి వెంట ఉన్న దాబాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం నిల్వ చేయడం, విక్రయించడం, మద్యం సేవించేందుకు అనుమతించడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత దాబాల యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ శ్యామ్‌రాజ్ హెచ్చరించారు. యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇకపై కూడా పోలీస్, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో నిరంతర నిఘా కొనసాగిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.