www.breakingnow.app | Fri, 27 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

Share:
128 Views
ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

మెట్‌పల్లి: ఇంద్రనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి కనకతార ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ఆహార పదార్థాలను ఆమె ఆసక్తిగా తిలకించి అభినందించారు. చదువుతోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న పాఠశాల సిబ్బందిని ప్రశంసించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, ఆర్పీలు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.