యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో రికార్డుల మోత మోగించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో యూఏఈపై కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 53 బంతుల్లో 28 సిక్సర్లు, 7 ఫోర్లతో 204 పరుగులు చేశాడు. కేవలం 28 బంతుల్లో శతకం, 40 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. తొలుత యూఏఈ 249 పరుగులు చేయగా, భారత్-ఎ 250 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
SPORTS
Delhi, New Delhi
52 బంతుల్లో వైభవ్ డబుల్ సెంచరీ
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in SPORTS
వన్డేల్లో కోహ్లీ అరుదైన రికార్డు!
Nov 04,2026 11:03 pm
నవంబర్ 22న భారత్–పాక్ సమరం
Nov 02,2026 08:06 pm
అభి‘షేకింగ్’ చరిత్ర సృష్టించిన టీమిండియా!
Oct 27,2026 05:24 pm
భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Oct 25,2026 09:39 pm