www.breakingnow.app | Mon, 23 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Tirupati

తిరుపతి మేయర్‌గా శ్రీనివాస ప్రసాద్

Share:
128 Views
తిరుపతి మేయర్‌గా శ్రీనివాస ప్రసాద్

తిరుపతి నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా ఎం. శ్రీనివాస ప్రసాద్‌, డిప్యూటీ మేయర్‌గా పాలడుగు విజయ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకుడు డా. ఎం. వరప్రసాద్‌ సమక్షంలో జిల్లా కలెక్టర్‌ డా. ఎస్‌. వెంకటేశ్వర్‌ వారితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన మేయర్‌, డిప్యూటీ మేయర్‌తో పాటు కార్పొరేటర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నగరపాలక సంస్థ పాలకవర్గం అధికారికంగా బాధ్యతలు చేపట్టడంతో తిరుపతి నగర అభివృద్ధి, పౌర సేవల నిర్వహణపై కొత్త పాలకవర్గం దృష్టి సారించనుంది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.