మెట్‌పల్లి RTC డిపోలో సిబ్బందికీ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో CPRపై అవగాహన కార్యక్రమం
NEWS Oct 13,2026 06:19 pm
విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ,మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి CPRపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సీపీఆర్ చేయడం నేర్చుకోవాలని, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ముఖ్యంగా గుండె ఆగిపోయినప్పుడు సకాలంలో సీపీఆర్ చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని,.వైద్య సహాయం అందేలోపు సీపీఆర్ చేయడం బాధితుల ప్రాణాలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని జగిత్యాల జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి తెలిపారు.