మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
NEWS Oct 13,2026 10:22 am
మార్కాపురం జిల్లా పరిధిలోని మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపాలిటీల్లో మొత్తం 100 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 4, ఎస్సీలకు 12, బీసీలకు 34, మహిళల జనరల్‌కు 27, అన్‌రిజర్వ్‌డ్‌కు 23 వార్డులు కేటాయించారు. రిజర్వేషన్ల ప్రకటనతో మున్సిపల్ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది.