పోలింగ్ బూతులు, స్ట్రాంగ్ రూముల పరిశీలన
NEWS Oct 13,2026 10:22 am
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులు, స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను సమీక్షించి, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.