చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
NEWS Oct 06,2026 11:18 pm
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్" కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ నేత రావు పద్మ పాల్గొని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వారికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం టీచర్లను సన్మానించి చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సేవే లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు అంగన్వాడి సిబ్బంది తదితరులు ఉన్నారు.